డిగ్రీ విద్యార్ధులకు యూనిఫామ్ అందజేత

Nov 26,2024 18:39 #alamuru

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ వి.నరసింహస్వామి, ఎకనామిక్స్ అధ్యాపకులు డాక్టర్ బాలస్వామి, ఇంగ్లీష్ లెక్చరర్ డా. బి.ఆశిష్ బాబు, మ్యాథ్స్ అధ్యాపకులు డా. వి.మంజులత, హిస్టరీ అధ్యాపకులు కరుణశ్రీలు రూ.25 వేల విలువైన రెండు జతల యూనిఫామ్ లను ఆలమూరు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ గారపాటి త్రిమూర్తులు చేతులమీదుగా అందజేశారు. రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తేజ, శేఖర్, కళాశాల సీనియర్ అసిస్టెంట్ తోట మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

➡️