సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ ప్రతుల దహనం

Feb 6,2025 11:19 #budget copies, #burning, #Central, #cpm

ప్రజాశక్తి-రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండలం, తాడిగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్‌ అని అన్నారు. ఈ బడ్జెట్‌లో రైతులకు, వ్యవసాయ కార్మికలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్రానికి నరేంద్ర మోడీ తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల వీరాస్వామి, రైతు సంఘం నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️