ప్రజాశక్తి-చీమకుర్తి: సంఘాలు తీసుకునే నిర్ణయాలను గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల యజమానులు తప్పక పాటించాలని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పలు యూనిట్లను పరిశీలించారు. కొన్ని యూనిట్లు పని చేస్తుండాన్ని గమనించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కాట్రగడ్డ రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఆదివారం యూనిట్లకు సెలవుదినంగా పాటించాలని నిర్ణయించారనీ, దానికి విరుద్ధంగా పనిచేస్తే యూనియన్ తీసకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. యూనిట్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయనీ, ఉత్పత్తిని తగ్గిస్తే కొంతమేర డిమాండ్ పెరిగే అవకాశముందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సెలవు దినంగా చీమకుర్తి మండలంలోని అన్ని యూనిట్లు పాటించాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కాట్రగడ్డ రమణయ్య, నూకల సురేంద్ర కుమార్, జిల్లా ప్రతినిధి కందిమళ్ళ గంగాధరరావు, గౌరవాధ్యక్షుడు ఎస్‌కె అహమ్మద్ బాషా, ప్రతినిధులు ఎస్‌కె అప్‌సాలేహా, ఎస్‌కె రఫీ, రామకృష్ణ(ఆర్‌కె), గొల్లపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
