ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణ తోపుడుబండ్ల యూనియన్ నాయకుడు బెవర తాతారావు (73) గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి మరణించారు. స్థానిక రావులపేటలో నివాసముంటున్న ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈయన పార్టీకి వీరవిధేయుడు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జెండాను భుజాన వేసుకుని ఓటర్లను ఆకర్షించడం ఈయన నైజం. ఎన్నికల ప్రచారంలో జెండా పట్టుకుని నాయకుల కంటే ముందు ప్రతీ ఇంటి గుమ్మం తొక్కి ఓటర్లను ఆకర్షించడం ఈయన ప్రత్యేకత. అంతేగాక పట్టణంలో తోపుడు బండ్ల యూనియన్ స్థాపించి మూడు పర్యాయాలు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన కఅషి ఫలితంగా సంఘానికి స్థలం కూడా సమకూరింది. యూనియన్ నాయకుడిగా తోపుడు బండ్ల వ్యాపారులకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి సమస్య పరిష్కారానికి కఅషి చేసేవారు. ఈయన మఅతి పట్ల తోపుడు బండ్ల సంఘం సంతాపం తెలిపింది. పలువురు టీడీపీ నాయకులు తమ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
