వెలగని వీధిలైట్లు

May 19,2024 23:21 #Arilova, #street lights problem
street lights problem

 ప్రజాశక్తి – ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీ చివరి ప్రాంతాలైన శివాజీనగర్‌-2, భగత్‌సింగ్‌ నగర్‌ పరిసర ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతంలో బస్టాపు, వైన్‌షాపు, బార్‌లు ఉండడంతో ఎక్కువగా జనసంచారం ఉంటుంది. కుక్కలు, మందుబాబులు, ఆకతాయిలు వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయపడుతున్నారు. ఇక్కడ వైన్‌షాపు, బార్‌ ఉండడంతో మందు బాబులు తూగుతుంటారు. ఆ సమయంలో చీకటిలో మహిళలు రాకపోకలు సాగించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇదే రహదారిలో వాకర్స్‌ ఎక్కువగా నడుస్తుంటారు. రాత్రిపూట దొంగతనాలు జరుగుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీధి దీపాలు పునరుద్ధిరించాలని సంబంధిత అధికారులకు, స్థానిక కార్పొరేటర్‌కు ఫోన్లు చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

➡️