20 ఏళ్లుగా పరిష్కారంకాని మురుగునీటి సమస్య

Jul 14,2024 15:08 #20 years, #sewage problem, #Unsolved

ప్రజాశక్తి-రామచంద్రాపురం (కోనసీమ) : పట్టణంలో 20 ఏళ్లుగా మురుగునీటి సమస్య పరిష్కారం కాలేదని దీంతో రాత్రి పగలు పలు ఇబ్బందులకు గురవుతున్నామని బ్రాడీపేట, వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అక్కడి ప్రజలు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ ఉన్న గండేటి పైడారావు వీధి చివర ఆర్యవైశ్య కళ్యాణమండపం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో సంవత్సరాల తరబడి వర్షాకాలంలో నీరునిల్వ ఉండి పోతుంది. దీని వలన చుట్టుపక్కల వారికి భరించలేని దుర్గంధం కలిగిస్తూ డెంగీ, మలేరియా విషజ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పురపాలక సంఘం కమిషనర్‌ అధికారులు దీనిపై స్పందించి తగుచర్యలు తీసుకొనవలసిందిగా ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

➡️