ప్రజాశక్తి- బాపట్ల : బాపట్లలోని ఉప్పరపాలెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్‌ను నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య కోరారు. ఉప్పరపాలెం వెన్నెలకంటి నగర్‌లో ప్రజా చైతన్య యాత్ర బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంగయ్య మాట్లాడుతూ బాపట్ల పట్టణ జనాభా సుమారు లక్షల 20వేలుకు చేరినట్లు తెలిపారు. రైలు పట్టాలకు ఉత్తరం వైపు ఉన్న ఉప్పరపాలెం , రైలు పేట ఏరియా విస్తారంగా పెరిగింది. ఈ ప్రాంతంలో 8 మున్సిపల్ వార్డులు ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రాంత ప్రజలు పట్టణంలోని ప్రధాన ప్రాంతానికి రావాలంటే రైల్వే గేట్ తోనే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పేదలు, మైనారిటీలు వెనకబడిన తరగతుల వారు ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. కనీస వసతులు కల్పించడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమైటన్లు తెలిపారు. ఉప్పరపాలెం రైల్వే గేటు ద్వారా నిత్యం వందలాది వాహనాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అప్ లైన్, డౌన్ లైన్‌పై రైళ్లునడుస్తున్నట్లు తెలిపారు. దీనికి మూడో రైల్వే లైన్ తోడైనట్లు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. ఫలితంగా గంటల తరబడి గేటు మూసే ఉంటుందన్నారు. దీంతో గంటల సేపు వాహనాలు నిలిచిపోతున్నట్లు తెలిపారు. ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండయ్య, క.నాగేశ్వరరావు ,శరత్, సుభాషిణి, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
