సేంద్రీయ ఎరువులు వాడాలి

Nov 6,2024 00:07 #Polam pilusthondi
Polam pilusthondi

 ప్రజాశక్తి- ఆనందపురం : పంటలకు రసాయనాలకు బదులు సేంద్రీయ ఎరువులను వాడాలని జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి సూచించారు. మండలంలోని బంటుపల్లి వారి గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం పొలం పిలుస్తోంది. కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేంద్రీయ ఎరువుల వాడటం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. కాయగూరలు పంటలపై సస్యరక్షణ, హైబ్రిడ్‌ వెజిటబుల్స్‌ స్కీమ్‌ గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సిహెచ్‌.సంధ్యారత్నప్రభ, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అహ్మద్‌ గౌస్‌, రైతులు పాల్గొన్నారు. 

➡️