ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ స్యలను పరిష్క రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యుటి ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజరుకుమార్‌, పాలెం మహేష్‌ బాబు పేర్కొ న్నారు. మంగళవారం యుటిఎఫ్‌ భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపా ధ్యాయులను పూర్తిగా విస్మరించడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్‌ పిఆర్‌సిని పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం మెరుగైన వేతనాలను అమలు చేస్తుందని ఆశించి భంగపాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023, జులై నుంచి నూతన పిఆర్‌సిని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం కమిషన్‌ను సైతం నియమించకపోవడంపట్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవు తున్నార న్నారు. 117 జీవోను బేషరతుగా రద్దు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు మాట తప్పుతూ విలీన విద్య పేరుతో ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తుందని ఆరోపి ంచారు. ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రాథమికోన్నత పాఠశాలలో పూరి ్తగా కనుమరుగయ్యే ప్రమాదం దాపురించిందన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభు త్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశ ంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సి.వి.రమణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు డి. కృష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.గోపినాథ్‌, బి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️