ప్రజాశక్తి – వీరఘట్టం : మీ ఊరు బడిని మీరు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యుటిఎఫ్ మండల శాఖ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మండలంలోని కంబరలో శుక్రవారం ప్రతి ఇంటికీ వెళ్లి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. గ్రామంలో ఉన్న పాఠశాల మోడల్ పాఠశాలగా ఎంపికైందని, అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు నియమించడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తి పలికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఎం.పైడిరాజు, కె.గోవిందరావు, బి.దుర్గాప్రసాద్, ఎం.ముకుందరావు, కె.సింహాచలం, ఎస్.గణేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
