ప్రజాశక్తి – మద్దికేర : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు సాల్ట్ పథకం ద్వారా నిర్వహిస్తున్న లీడర్షిప్, ఎఫ్ ఎల్ ఎన్ రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎంజీ నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వం
వీటిని సాగించడం శోచనీయమని అన్నారు. నిన్న (గురువారం నవంబర్ 28) ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుకు గురై మరణించడం బాధాకరమని, వెంటనే ఈ శిక్షణ కార్యక్రమాలను రెసిడెన్షియల్ విధానంలో కాకుండా నాన్ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఎం రంగన్న, ఏం విశ్వనాథ్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.