ప్రజాశక్తి – గరివిడి : గజపతినగరం బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతున్న స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ లో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు హటాత్తుగా గుండె పోటుతో మరణించారు. ఆయన మృతికి నిరసనగా గరివిడి మండల విద్యా వనరుల కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో యుటిఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని, రెసిడెన్సియల్ శిక్షణ అని, ఉపాధ్యాయులను ఒత్తిడి కి గురిచేసే శిక్షణ లను రద్దుచేయాలని, మరణించిన ఉపాధ్యాయునికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రక టించాలని ఈ సందర్భంగా యుటిఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యుటిఎప్ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు డి. రాము, ఎ. సత్య శ్రీనివాసు, జి. పద్మావతి, మండల బాధ్యులు రవికుమార్, గోపాల కృష్ణ, సూరి శ్రీను, ఎం. సూర్యనారాయణ,ఐక్య సత్యానా రాయణ, బి. బంగార్రాజు,డి. సతీష్, కనకేశ్వర రావు, వరప్రసాద్, కోట్ల రమణ, తదితరులు పాల్గొన్నారు