సీనియారిటీ జాబితాలో సవరణలు చేయాలి : యుటిఎఫ్‌

Mar 10,2025 21:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విద్యాశాఖ వెలువరించిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలో సవరణలు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు సోమవారం డిఇఒ యు.మాణిక్యంనాయుడును కోరారు. ఈమేరకు ఆయనకు వినతి అందజేశారు. విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో మార్కులు, రోస్టర్‌లో లోపాలు ఉన్నాయని, విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని, వెంటనే వాటిని సవరించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, రమేష్‌ చంద్ర పట్నాయక్‌, కె.భాస్కరరావు, తిరుపతి నాయుడు, సత్యన్నారాయణ, రాం ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

➡️