విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: యుటిఎఫ్‌

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్రంలో విద్యారంగంలో అపరిష్కతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌ ఏ రవిశంకర్‌కు యుటిఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 17ను రద్దు చేసి 1 నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యలోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా సమాంతర విద్యా బోధనను ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గించాలన్నారు. వివిధ అంశాలకు సంబంధించి వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు మీనక శీను, కార్యదర్శి కాసిం, నాయకులు రాజశేఖర్‌, అట్లూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️