ప్రజాశక్తి-సిఎస్.పురం : మండల పరిధిలోని చెన్నప్పనాయనపల్లి ఎంపియుపి పాఠశాలలో ఎస్‌జిటి ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందిన టి.చెంచురెడ్డి కుటుంబానికి యుటిఎఫ్ సంక్షేమ నిధి నుంచి రూ.1.50లక్షల చెక్కును అందజేశారు. ఎంఇఒ ప్రసాద్‌రావు చేతుల మీదుగా మృతుడి కుమారుడు ప్రదీప్‌రెడ్డికి గురువారం చెక్కు అందజేశారు. తొలత స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం వద్ద చెంచిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.వెంకట్రావు, షేక్.పాదుషా మాట్లాడుతూ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం యుటిఎఫ్ సభ్యులకు ఆపన హస్తం వంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సంక్షేమ కన్వీనర్ ఎన్.తిరుపతయ్య, మండల గౌరవాధ్యక్షుడు జి.వేమానారాయణ, యుటిఎఫ్ నాయకులు ఎన్.వెంకట్రామయ్య, పి.నాయబ్ రసూల్, జి.శ్రీనివాసరాజు, వి. సాంబశివరావు, ఐ.కొండయ్య, ఎం.శ్రీనివాసులు, ఎం.కిరణ్‌కుమార్, జి.రవిబాబు పాల్గొన్నారు.
