ఉచిత ఇసుక విధానం అమలు పేరుతో చేసిన హడావుడి బూమరాంగైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. కడప జిల్లాలో 13 రీచ్‌ల పరిధిలో 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. కానీ ఇక్కడే తేడా కొట్టింది. ఇసుక లబ్ధిదారునికి డిఎంఎఫ్, సీనరేజీ, నిల్వల రక్షణ మొదలగు నిర్వహణా ఖర్చుల పేరుతో వివిధ స్టాక్‌పాయింట్ల నుంచి రూ.381 నుంచి రూ.580 మేరకు పలు రకాలుగా వసూలు చేస్తోంది. దీనిపై ఇటీవల నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష వైసిపి ఉచిత ఇసుక విధానం అమలుపై నిలదీసింది. టిడిపి ఉచిత ఇసుక విధానంపై ఇచ్చిన హామీని ఉల్లంఘి స్తోందని వాగ్భాణాలను సందించింది. ఉచిత ఇసుక విధానంపై ఇచ్చిన హామీ మేరకు డిఎంఎఫ్, సీనరేజీ, నిర్వహణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసింది. ఉచిత ఇసుక విధానం అమలు పేరుతో సుమారు ఐదు రకాల పన్నుల్ని వసూలు చేయడం అంటే ఉచిత ఇసుక సరఫరా హామీని ఉల్లం ఘించడమే అవుతుందని నిలదీసింది. దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పం దిస్తూ ప్రస్తుతం ఉచిత ఇసుక నిల్వలను తరలించడానికి సంబం ధించిన తాత్కాలిక విధానమేనని, నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక లభ్యతను, రవాణాను సుప్రీంకోర్టు వ్యతిరేకించిన నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి ఇసుక విధానానికి రూపకల్పన చేస్తున్నామని వివరించడం తెలిసిందే. ఉచిత ఇసుక విధానం అమలు నేపథ్యంలో లబ్ధిదారు భారీగా సమర్పించుకోవాల్సి ఆందోళన సహేతుకమేనని చెప్పవచ్చు. సుమారు ఐదు రకాల పన్నుల చెల్లింపుల అనంతరం రవాణా ఖర్చులను కలిపి లెక్కిస్తే టిప్పర్‌కు సుమారు రూ.8,500 వరకు మూల్యం చెల్లించాల్సి వస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. జిల్లా హద్దులను దాటి తరలించే అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీని ప్రభావం స్థానిక లబ్ధిదారులపైనా పడే ప్రమాదం పొంచి ఉంది. ఇంతటి స్థాయిలో రుసుము చెల్లించుకోవాల్సిన నేప ధ్యంలో ఉచిత ఇసుక విధానమనే పేరుపెట్టడం సహేతుకం కాదని విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తో ంది. ఉమ్మడి కడప జిల్లాలో సుమారు 40 వేల మంది భవన నిర్మా ణ కార్మికుల భవిత వ్యం ఇసుక, ఇటుక, సిమెంట్ లభ్యతపై ఆధార పడి ఉంది. ఇసుక ఆవశ్యకతను గమనించిన టిడిపి జాతీయ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సార్వ త్రిక ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామనే హామీ పేరుతో ఊదరగొట్టిన నేపథ్యం చర్చనీయాంశంగా మా రింది. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనే జోడు గుర్రాలను సవారీ చేయడం తనకు తెలు సునని, సంపదను సృష్టించడం ద్వారా సమ ర్థంగా అమలు చేస్తామనే వాగ్దానా లను అమలు చేయడం రాష్ట్ర నా యకత్వ దక్షత, సమర్థతలకు పరీక్షగా మారింది. రాష్ట్రంలో అప్పు లేనిదే పూటగడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసాధ్యమని తెలిసీ హామీలిచ్చి, వాటి అమలు ప్రశ్నార్థకంగా మారి ంది.ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమి చేయాలో తెలియని వాతావరణం నెలకొంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి
