వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

ప్రజాశక్తి-రాయచోటి సాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న త్యాగాలు, భావి తరాలకు స్ఫూర్తిదాయకమని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్ర సాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓబన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు. ఓబన, 11 జనవరి 1807న నంద్యాల జిల్లా, సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారన్నారు. ఓబన్న స్వాతంత్య్ర సమరయోధుడు యుద్ధ వీరుడు సర్వ సైన్యాధ్యక్షుడు గెరిల్లా యుద్ధ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉండి ఆనాటి బ్రిటిషర్లపై అక్రమ పన్ను వసూళ్లకు పాల్పడుతున్నందుకు మన దేశం స్వాతంత్రం కొరకు ఆనాడే పోరాడి ప్రాణత్యాగాలు చేశారన్నారు. మొదటి యుద్ధ వీరుడు వడ్డే ఓబన్న : డిఆర్‌ఒ ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించుకొని అన్ని రంగాలలోని ప్రజలను దోపిడీ చేస్తున్న సమయంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా సాయుధ సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్‌ వారిపై తిరగబడ్డ మొట్టమొదటి యుద్ధ వీరుడు వడ్డే ఓబన్న అని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌ రావు అన్నారు. కలెక్టరేట్‌లో బిసి సంక్షేమ అధికారి సురేష్‌ బాబు నేతత్వంలో ఓబన్న జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ మొదటి తరం భారత స్వాతంత్య్రం పోరాటంలో భాగంగా బ్రిటిష్‌ వారిపై సాయుధ పోరాటం చేయడానికి కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్‌ ఏరియా ప్రాంతంలోని వడ్డెరలను బోయలను చెంచులను 9 వేల మందికి పైగా సాయుధ సైన్యానికి వడ్డే ఓబన్న నాయకత్వం వహించి 1846లో బ్రిటిష్‌ అరాచక ప్రభు త్వంపై మూడు దఫాలు యుద్ధం ప్రకటించారని తెలిపారు. ఎపి వడ్డెర విద్యా వంతుల వేదిక వ్యవస్థాపకులు ఈశ్వర్‌ మాట్లాడుతూ సిపాయిల తిరుగుబాటు కంటే పది సంవత్సరాలుముందే సైరా నరసింహారెడ్డి నేతత్వంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడుగా ఉండి దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మొదటిసారిగా సాయుధ పోరాటంతో దేశ స్వాతంత్య్ర పోరాటానికి వడ్డే ఓపన్న పునాది వేశారన్నారు. కార్యక్రమంలో ఎపి విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి శంకర్‌, ఉపాధ్యక్షులు కుంచపు రెడ్డయ్య చల్లారెడ్డయ్య, సర్పంచ్‌ వాసు, మాజీ సర్పంచ్‌ బసయ్య, విద్యావంతుల వేదిక రవిశంకర్‌, డాక్టర్‌ లక్ష్మి ప్రసాద్‌, బాలకష్ణ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే షాజ హాన్‌ పేర్కొన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆంగ్లేయుల కుట్రలని తిప్పికొట్టి, తన గుండె ధైర్యంతో వారి వెన్నులో భయాన్ని పుట్టించారన్నారు. కార్యక్రమంలో మదనపల్లె వడ్డెర సంఘం పట్టణ అధ్య క్షులు ఇడగొట్టి రెడ్డిశేఖర్‌, బండి ఆనంద్‌, పద్మనాభం, గుణశేఖర్‌, తమ్మిశెట్టి రామకష్ణ, రాజా, హెచ్‌ఎం రెడ్డెప్ప, పల్లపు రమేష్‌, మేస్త్రిలు శ్రీనివాసులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కడప అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, యువనేత ముక్కా సాయివికాస్‌రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే రాష్ట్రంలోని దేవాటి గడ్డపై అధిక పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా రాయలసీమ రైతుల హక్కుల కోసం బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయ కులు, గుండయ్య నాయుడు, నాగేంద్ర, సంగరాజు రవికుమార్‌రాజు, శేఖర్‌, సుబ్బిరామిరెడ్డి, వెంకటేష్‌, చంద్ర శేఖర్‌, రాజశేఖర్‌ రాజు, ఉత్తరాది మహేష్‌, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె: మండల కేంద్రంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్‌ శివకుమార్‌, మాజీ సర్పంచ్‌ లక్ష్మిపతి సంఘం మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి, మండల అధ్యక్షులు రేపన మల్లికార్జున, సంఘం మండల నాయకులు రమేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️