విజయనగరం : సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే లక్ష్యంగా వాజి ఛానల్ గత 29 సంవత్సరాలుగా రంగోలి పోటీలను నిర్వహిస్తూ వస్తోందని వాజీ ఛానల్ మేనేజింగ్ డ్కెరక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జనవరి 12వ తేదీన ఉదయం 11 గంటలకు ఆనందగజపతి ఆడిటోరియంలో రంగోలి పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది రంగోలీ పోటీలలో 3 లక్షల రూపాయల విలువగల బహుమతులను విజేతలకు అందించనున్నామని తెలిపారు. ఈ పోటీలలో ముగ్గు వేసే ప్రతి ఒక్కరికి పలు బహుమతులు అందించనున్నామని అన్నారు. విజయనగరంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారిలో నిబిడీకఅతంగా ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికితీసేందుకు గడిచిన 29 ఏళ్లుగా వాజీ నిర్వహిస్తున్న రంగోలీ పోటీలలో ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది పాల్గన్నారని అన్నారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆనందగజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ, హౌసీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 31వ తేదీన వాజీ మెగా హౌసీలో ఫుల్ హౌసీ అయి, పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్ధులు నేరుగా ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగే బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కావాలని సూచించారు.