వామ్మో..పులులు

ప్రజాశక్తి పులివెందుల టౌన్‌ పులివెందుల నియోజక వర్గంలో పులుల సంచార వరుస సంఘటనలతో కంటిమీద కునుకు లేకుండా రైతులు, ప్రజలు హడలె త్తుతున్నారు. పొలా లలోకి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. పులి వెందుల మండల పరిధిలోని ఆర్‌ . తుమ్మలపల్లి గ్రామ పొలాలలో ఆదివారం ఉదయం పులిపిల్ల సంచ రించినట్లు ప్రజలు తెలి పారు. గంగిరెడ్డి అనే రైతు నువ్వుల పంటలో పులి పిల్ల కనిపించిందని కేకలు వేయడంతో పారిపోయిందన్నారు. పది రోజుల నుంచి పులివెందుల నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పులి కనిపించిందని స్థానికులు పేర్కొంటున్నారు. మండల పరిధిలో నల్లపు రెడ్డి గ్రామ సమీపంలోని నాగమ్మ కుంటలో పులి సంచరించినట్లు రైతు విష్ణు వర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. అరటి సాగు నిమిత్తం తోట వద్దకు వెళుతుండగా అటువైపు పులి వెళ్లినట్లు గుర్తించానని, దాని అడుగులు ఫొటో తీశానని చెప్పారు. ఇకపోతే లింగాల మండలం కామసముద్రం గ్రామంలో మిద్దె ఆదినారాయణ అనే రైతు పొలం వద్ద ఒక పెద్ద పులి, మూడు చిన్న పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్‌ అధికారులు, స్థానిక పోలీసులు, లింగాల తహశీల్దార్‌ ఈశ్వరయ్య పరిసర ప్రాంతాలలో పరిశీలించి చుట్టుపక్కల రైతులను ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దని గ్రామ రెవెన్యూ సహా యకుల ద్వారా సమాచారం ఇచ్చారు. సింహాద్రిపురం మండలం బలపనూరు సమీపంలో రైతు పొలానికి వేసిన కరెంటుకు చిరుత పులి మరణించింది. రైతు భయపడి పాతి పెట్టడం జరిగింది. ఫారెస్ట్‌ అధికారులకు విషయం తెలియడంతో రైతు పాతిపెట్టిన చిరుతను బయటకు తీసి అతనిపై కేసు నమోదు చేశారు. పులుల సంచారం రైతుల్లో ఆందోళన కలి గిస్తుంది. నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తారని అధికా రులపై రైతులు ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పులులు సంతరిస్తున్నాయని రైతులు చెబెతున్నా అధికారుల మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహించడంపై పలు విమర్శలు దారి తీస్తోంది. కేవలం నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో నిర్వహించలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి వాటిని పట్టుకుని జంతుశాలలకు తగిలించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

➡️