ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుత్తుల వీరబ్రహ్మం ఎన్నికయ్యారు. దీంతో ఆలమూరు మండల బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు బంతు లోకేష్, వనం లక్ష్మణరావు, వాసా దుర్గాప్రసాద్, వైవివి రమణ, వాకా గోవిందరాజు, పివి రమణమూర్తి, దాసరి సుబ్రహ్మణ్యం, వడ్లమూరి రవీశ్వర్, ఉడత వెంకటేశ్వరరావు, వి.వంశీ తోపాటు పలువురు బీసీ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.
