ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఉండి మెయిన్ సెంటర్లో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వాహన తనిఖీలను శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఎం రామకఅష్ణారెడ్డి మాట్లాడుతూ … ఎవరైనా 50 వేల రూపాయలకుమించి నగదు తీసుకువెళితే దానికి ఆధారం చూపించాలని లేనిపక్షంలో ఆ నగదును స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. పదివేల రూపాయల గురించి బహుమతులు తరలించడం నేరమని వాటికి సంబంధించిన పత్రాలను తమ దగ్గరే ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ ఆకురాతి సూర్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
