జిజిహెచ్‌కు వెంకటరావు భౌతిక కాయం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అద్దంకి వాసి, అభ్యుదయ వాది గుంజి వెంకటరావు పార్థి వ దేహాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్యకళాశాలకు దానం చేశారు. ఈ సందర్భంగా వెంకటరావు కుమారుడు కష్ణ చైత న్య మాట్లాడుతూ తన తండ్రి జీవించినంత కాలం ప్రజలు, కార్మికులకు సేవ చేసాడని, ఆయన చివరి కోరిక మేరకు కు టుంబ సభ్యుల సమ్మతితో శరీరాన్ని దానం చేశామని అన్నా రు. వైద్య కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ సిహెచ్‌ సుధాకర్‌ బాబు మాట్లాడుతూ అవయవ దాన అవగాహన ప్రజల్లో తక్కువగా ఉందని, వెంకటరావు వంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రకాశం నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక గౌరవ సలహాదారు డాక్టర్‌ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అవయవ దాతల కొరతతో లక్షల మంది చనిపోతున్నారని, ప్రజలు స్వచ్ఛంద అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐక్య వేదిక కన్వీనర్‌ బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఒంగోలు కేంద్రంగా తమ సంస్థ స్వచ్ఛంద దాతలను ప్రోత్సాహిస్తున్నదని, ప్రజలు మూఢనమ్మకాలు వదిలి అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంజి వెంకటరావు కుటుంబ సభ్యులు చక్రవర్తి, రామమోహనరావు, హనుమంతరావు, ఐక్యవేదిక స్వచ్ఛంద కార్యకర్తలు చావలి సుధాకరరావు, గాండ్ల హరిప్రసాద్‌, దామా శ్రీనివాసులు, ఆరిగ శ్రీనివాసరావు, ఎస్‌వి రంగారెడ్డి, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️