జనసేనలోకి వైస్‌ ఎంపిపి

Jan 20,2025 21:22

ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం వైస్‌ ఎంపిపి పడాల సత్యవతి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎంపిడిఒ కె.గాయత్రికి సోమవారం అందజేశారు. అనంతరం ఆమె జనసేన పార్టీలో ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో చేరారు. ఆమెతోపాటు వైసిపి నాయకులు పడాల శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు పడాల రాజేశ్వరి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ, భోగాపురం పంచాయతీ ఏడో వార్డు సభ్యులు పడాల త్రివిక్రమరావు, టిడిపి మండల మాజీ ఉపాధ్యక్షులు అడ్డగర్ల వెంకట్రావు, డెంకాడ మండలం పేడాడకు చెందిన వైసిపి నాయకులు మెహంది సురేష్‌ కుమార్‌, జగదీశ్వరరావు తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాసరావు, సత్యవతి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలంటే అది ఎమ్మెల్యేతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం మాధవి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వందనాల రమణ, గుండు దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️