మురళీకృష్ణ సంస్థల కార్మికుల విజయోత్సవ వేడుకలు

Jun 9,2024 15:37 #aalamuru

ప్రజాశక్తి – ఆలమూరు :రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించిన సందర్భంగా మండలంలోని పెదపళ్ళ పరిధి శ్రీమురళీకృష్ణ సంస్థకు చెందిన కార్మికుల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త వంటిపల్లి పాపారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండల కేంద్రంలోని పాపారావు నివాసం నుంచి బాణాసంచా కాల్చుతూ పెద్దపళ్ళ శ్రీమురళీకృష్ణ రైస్‌ మిల్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మురళీకృష్ణ స్టాప్‌ పాపారావును పూలమాలలతో పుష్పగుచ్చాలతో ముంచేత్తారు. ఈ సందర్భంగా స్టాఫ్‌ ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, మురళీకృష్ణ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, మండల ఆడపడుచులకు, పేరుపేరునా పాపారావు కఅతజ్ఞతలు తెలియజేశారు.

➡️