కూటమి నేతల విజయోత్సవాలు

Jun 9,2024 23:20 #Tdp sambaralu
Tdp Sambaralu

ప్రజాశక్తి -యంత్రారగం మధురవాడ : కూటమి గెలిచిన సందర్భంగా ఎండాడ, భీమిలి పార్టీ కార్యాలయంలో ఆదివారం విజయోత్సవం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్‌ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధించటం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ విజయాన్ని నమోదుచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీగా శ్రీభరత్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు, రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. భీమిలి నియోజకవర్గం జనసేన బూత్‌ కన్వీనర్‌ శాఖరి శ్రీనివాస్‌ అధ్యక్షతన విజయోత్సవ కేక్‌ కటింగ్‌ చేశారు. కూటమి అభ్యర్థుల విజయంలో జనసేన నాయకులు కీలకపాత్ర పోషించారని, భవిష్యతులో అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్‌ సెక్రటరీ బివి.కృష్ణయ్య, నాయకులు శివ, సంతోష్‌ నాయుడు, నాగోతి నరసింహనాయుడు, దేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 8వ వార్డు పరిధిలోని పలు కాలనీల్లో జనసేన జెండాను ఆవిష్కరించారు. అమనాంలో టిడిపి విజయోత్సవం భీమునిపట్నం : మండలంలోని అమనాం గ్రామంలో ఆదివారం సాయంత్రం టిడిపి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు దంతులూరి అప్పల నరసింహరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు దంతులూరి నృసింహ సత్య నారాయణరాజు, పలువురు జన సేన నాయకులు పాల్గొన్నారు

➡️