పాడా పనులపై విజిలెన్స్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధి పులివెందుల అధారిటీ డెవలప్‌ మెంట్‌ ఏజెన్సీ (పాడా) కింద చేప ట్టిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం విజిలెన్స్‌ తనిఖీలకు ఆదేశించింది. విజయ వాడ నుంచి వచ్చిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నాలుగు బృం దా లుగా విడిపోయి తనిఖీలను వేగవంతం చేసింది. రెండ్రోజులుగా పాడా కింద వైసిపి హయాంలోని ఐదేళ్లలో చేపట్టిన 6,300 పనుల వివరాలను విభాగాల వారీగా ఆరాతీస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగాలు వైసిపి హయాంలో నీరు-చెట్లు పనులపై విజిలెన్స్‌ వేయగా, తాజాగా కూటమి సర్కారు పాడా పనులపై విజిలెన్స్‌ వేయడం ఏమిటని విస్తూపోతుండడం గమనార్హం. వైసిపి హయాంలో పులివెందుల డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై శూలశోధన మొదలైంది. వైసిపి హ యాంలో పాడా కింద పలు డిపా ర్టుమెంట్లు రూ.వందల కోట్లతో సుమారు 6,300 పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. పంచా యతీరాజ్‌ డిపార్టుమెంట్‌ 2,400 పనులు, మున్సిపాలిటీ 1,000, పబ్లిక్‌హెల్త్‌ విభాగం 500, ఆర్‌అండ్‌బి 500, నీటిపారు దలశాఖ సుమారు 1,000, ఎపి ట్రాన్స్‌కో 254, మిగిలిన వాటిని ఇతర విభాగాలు చేపట్టారు. కొన్ని పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్‌ అధికారుల బృందాలు క్షేత్ర స్థాయిలో పనుల వారీగా పరిశీలన చేసి నివేదికను అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎపి ట్రాన్స్‌కో ఇంజినీరింగ్‌ అధికార యంత్రాంగం లైనింగ్‌ టవర్ల ఏర్పాటు పనుల్లో నాసిరకం సామగ్రిని వినియోగించినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పులివెందుల మున్సిపాలిటీ కింద చేపట్టిన కొన్ని పనులకు రూ.38 కోట్లు చెల్లింపులు చేసింది. ఇది నియో జకవర్గ టిడిపి నాయకులకు కంటగింపునకు కారణమైనట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు ఏర్పడిన వెంటనే పాడా కింద చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ఆడిట్‌ చేయించింది. సుమారు వారం రోజులపాటు రాష్ట్ర ఆడిట్‌ బృందాలు ఆడిట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎటువంటి అవకతవకలు లేనట్లు తేలినట్లు సమాచారం. ఆడిట్‌ అనంతరం ఆర్నెళ్లు తిరిగేలోపు మరోసారి విజిలెన్స్‌ తనిఖీలకు ఆదేశించింది. 2014-19 పీరియడ్‌లో టిడిపి కేడర్‌ చేపట్టిన నీరు-చెట్లు పనులపై వైసిపి సర్కారు విజిలెన్స్‌ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మంది ఇంజినీర్ల జీవితాలతో విజిలెన్స్‌ తనిఖీల పేరుతో ఆడుకుంది. జిల్లాలో 12 నుంచి 16 మంది ఇంజినీర్లు విజిలెన్స్‌ తనిఖీలను ఎదుర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చీ రావడంతోనే కేబినెట్‌ తీర్మానం పేరుతో నీరు-చెట్టు పనులు చూసిన ఇంజినీరింగ్‌ అధికారులకు ఉపశమనం కలిగించింది. వైసిపి చేసిన తరహాలోనే కూటమి సర్కారు పులివెందుల అథారిటీ డెవలప్‌మెంట్‌ (పాడా) కింద చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్‌కు ఆదేశించడం ఏమిటని అధికార యంత్రా ంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వైసిపి హయాంలో కేడర్‌ చేపట్టిన పనులపై, వైసిపి అధికారం లోకి వస్తే టిడిపి కేడర్‌ చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్‌ తని ఖీల పేరుతో అధికారుల జీవితాలతో చెలగాటమాడడం ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

➡️