అభివృద్ధి పాలనను ఆశీర్వదించండి

Mar 31,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అభివృద్ధి పాలనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌.. ప్రజలను కోరారు. మండలంలోని జమ్మునారాయపురంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం బెల్లాన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఐదేళ్లపాటు సుపరిపాలన సాగిందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను శతశాతం అమలు చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా అర్హులందరికీ పథకాలను అందించామన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కెల్ల త్రినాథరావు, కెఎపి రాజు, సర్పంచ్‌ యడ్ల సత్తిరాజు, సువ్వాడ శ్రీను, వైసిపి నాయకులు కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

➡️