ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌కి జాతీయ అవార్డు

Feb 25,2024 21:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఈ ఏడాది నిర్వహించిన వివిధ సేవా, సంక్షేమ కార్యక్రమాలకు గాను జాతీయస్థాయి అవార్డు లభించింది. ఇన్నర్‌ వీల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో గతేడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు విజయనగరం ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ 100 కంటే ఎక్కువ సేవా ప్రాజెక్టులను చేసినందుకు ఆల్‌ ఇండియా స్థాయిలో టాప్‌గా నిలిచిందని క్లబ్‌ అధ్యక్షులు కాపుగంటి సుధ తెలిపారు. రాజమండ్రిలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి సరిత లునాని చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి గుండా రామ పాల్గొన్నారు.

➡️