క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌కు శంకుస్థాపన

Feb 25,2024 21:31

ప్రజాశక్తి-విజయనగరంకోట : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వద్ద రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌కు ప్రధాని మోడీ వర్చువల్‌ గా శంకుస్థాపన చేశారు. ఆదివారం ప్రధాని గుజరాత్‌ రాష్ట్రంలోని రాజకోట్‌ నుండి దేశ వ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. మన రాష్ట్రం లో 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్‌ కళాశాల నుండి లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఎంహెచ్‌ఒ భాస్కర రావు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మలీల, సూపరింటెండెంట్‌ అనేలా సునందిని, మెడికల్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు హాజరై వీక్షించారు. అనంతరం జెసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

➡️