చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Apr 1,2024 21:04

ప్రజాశక్తి-వంగర : మండలంలోని మడ్డువలస జలాశయంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ వైవి జనార్థన్‌ కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ గ్రామానికి చెందిన కొమర దేముడు (54) వంగర మండలంలోని పటువర్థనంలో 20 ఏళ్లుగా ఉంటూ మడ్డువలస జలాశయంలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. బోటు తిరగబడి ఉండడంతోపాటు ఆయన ధరించిన చెప్పులు సోమవారం కనిపించాయి. అదే చోట ఆయన మతదేహం లభ్యం అయింది. దీంతో ఆయన భార్య కొమర నూకమ్మ వంగర పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ జనార్దన్‌ కేసు నమోదు చేశారు. దేముడుకు భార్య నూకమ్మతోపాటు కుమారుడు రాజు, కుమార్తెలు ఆదిలక్ష్మి, వసంత ఉన్నారు.

➡️