మాత, శిశు మరణాల నియంత్రణే లక్ష్యం

Apr 1,2024 21:02

ప్రజాశక్తి-విజయనగరంకోట: మాతృ శిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేయాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు శిశువుల ఆరోగ్యంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మరణాల నివారణే లక్ష్యంగా కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు తదితర అంశాలపై సోమవారం డిఎంహెచ్‌ఒ ఆధ్వర్యాన పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసేవిధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆశా కార్యకర్తల విజ్ఞానాన్ని బలోపేతం చేయడం ద్వారా మెరుగైన మాతాశిశుఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️