సమ్మెలోకి అంగన్వాడీలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌యాప్‌ విధానం రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, తదితర డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సమ్మెకు దిగారు. కలెక్టరేట్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సేవలు నిలిచిపోయాయి. అంగన్వాడీల సమస్యలు పరిష్క రించాలని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా విజయనగరం అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని 11 సెక్టార్లలో 317 కేంద్రాలు బంద్‌ చేసి, కలెక్టరేట్‌ వద్ద వర్కర్లు, హెల్పర్లు పెద్దఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం నాలుగేళ్లుగా శాంతియుతంగా నిరసన తెలియజేశామని చెప్పారు. సోమవారం కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతీ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం, గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చడం, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహనరావు, ఎపి మెడికల్‌ సేల్స్‌ అండ్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు యుఎస్‌ రవికుమార్‌ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాత, శిశు సంరక్షణ కోసం గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలు ఒంటరి కాదని, మద్దతుగా ఉంటుందని భరోసాఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు విశాలాక్షి, శివలక్ష్మి, మంగ లక్ష్మి, సెక్టార్‌ లీడర్లు లలిత, ప్రసన్న, జయ, ఈశ్వరమ్మ, పార్వతి, సరస్వతి, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ కోట ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలు సమ్మె చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌ మాట్లాడారు. సమ్మెకు జనసేన నియోజకవర్గ సీనియర్‌ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, జామి మండల అధ్యక్షులు వర్మరాజు, వారధి స్వామినాయుడు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, ప్రాజెక్ట్‌ లీడర్స్‌ డి. శ్యామల, కె. వెంకటలక్ష్మి, ఏఐటియుసి నాయకులు వి. మాణిక్యం, బి.సుశీల పాల్గొన్నారు. చీపురుపల్లి: ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌ వాడీలు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు టివి రమణ, అంబళ్ల గౌరినాయుడు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి బి వరలక్ష్మి పాల్గొన్నారు.గజపతినగరం: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అనంతరం రోడ్డు మీదుగా బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎం సుభాషిని, పి. జ్యోతి, సెక్టార్‌ నాయకులు నాగమణి, సన్యాసమ్మ, రవణమ్మ, నారాయణమ్మ, వాణి, పద్మ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.బాడంగి: బాడంగిలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు సురేష్‌, రైతు సంఘం నాయకులు గోపాల్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రవణమ్మ, సీత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.కొత్తవలస: పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మె చేశారు. వీరికి సిఐటియు కార్యదర్శి గాడి అప్పారావు, సిపిఐ నాయకులు డేగల అప్పలరాజు, జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తులసి, రెడ్డి శంకరావతి పాల్గొన్నారు.గరివిడి: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గరివిడి, చీపురుపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తల మంగళవారం శాంతియుత ధర్నా చేపట్టారు. ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.రాజాం: రాజాంలో అంగన్వాడీలు ర్యాలీలు చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామమూర్తి నాయుడు, ఎఐటియుసి జిల్లా నాయకులు నీలకంఠ యాదవ్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బి.ఉమా కుమారి, దేవి, పార్వతి, సునీత, భారతి, చిన్నమ్మడు, ధవలేశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.భోగాపురం: భోగాపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. వీరికి జనసేనపార్టీ నాయకులు లోకం మాధవి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కృష్ణవేణి, కొర్లమ్మ, అనిత, చిన్నమ్మలు, వరలక్ష్మి, సుజాత, శ్రీదేవి, జనసేన నాయకులు పల్లంట్ల జగదీష్‌, పల్ల రాంబాబు పాల్గొన్నారు.

➡️