ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈనెల 4,5 తేదీలలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయనగరం బాలోత్సవం కమిటీ కన్వీనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక గురజాడ స్వగృహంలో బాలోత్సవం కరపత్రాల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనంద గజపతి కళాక్షేత్రంలో మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందులో ఆరువ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత సాంస్కతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. హాజరైన విద్యార్థులకు మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఎటువంటి ఫీజు రుసుము ఉండదన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు చలం, గురజాడ ఇందిరా, సూర్యలక్ష్మి, చిన్నదేవి శ్రీనివాస్, ధవళ సర్వేశ్వరరావు, రాజు, రాము, వెంకటేష్, డప్పు శీను తదితరులు పాల్గొన్నారు.
