సెంచూరియన్‌ విద్యార్థికిరూ.50 లక్షల ప్యాకేజీ

Jun 8,2024 21:02

ప్రజాశక్తి-నెల్లిమర్ల : సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బిటెక్‌ పూర్తిచేసిన కుసుమంచి చైతన్య రూ.50 లక్షల వేతన ప్యాకేజీకి ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్లాంక్‌ నెట్‌ వర్క్‌ సంస్థలో ఆయనకు అవకాశం లభించింది. చైతన్యది సాధారణ కుటుంబం. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32 లక్షల ప్యాకేజీకి కూడా చైతన్య ఎంపికయ్యాడు. శనివారం చైతన్యను యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రశాంత కుమార్‌ మహంతి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విసి మహంతి మాట్లాడుతూ కష్టపడి చదివిన వారికి మంచి ఫలాలు అందుతాయనడానికి చైతన్య నిదర్శనమన్నారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి సెంచూరియన్‌ ఒక మంచి వేదిక రిజిస్ట్రార్‌ పల్లవి తెలిపారు. ఐఐటి చదివిన విద్యార్థుల కంటే మెరుగ్గా తాను పోటీ ఇవ్వగలిగానని చైతన్య తెలిపాడు. డీన్‌ డాక్టర్‌ సన్నీ డయోల్‌, డాక్టర్‌ లక్ష్మణరావు తనను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నాడు.

➡️