అరగంట ప్రయాణానికి 6కిమీ నడక

Jun 8,2024 16:27 #Vizianagaram

ప్రజాశక్తి-వేపాడ : వేపాడ గ్రామములో సింగరాయ గ్రామమునకు ఆతవ గ్రామమునకు కిలోమీటర్ లోపు ఉన్న కోమటి చెరువు గట్టును ఉపాధి హామీ పథకం ద్వారా గట్టు వెడల్పు చేయడం జరిగింది వెడల్పు చేసిన గట్టుపై మెటల్ వేసి కంకర వేస్తే చాలు ఇరు గ్రామాల ప్రయాణానికి ఆటోలు , ద్విచక్ర వాహనాలు, రైతులు పండించే పంటను కల్లాలకు తెచ్చుకునే అవకాశం సులువుగా ఉంటుంది, ఈ రెండు గ్రామాలకు అత్యవసర సమయాల్లో వర్షం వస్తే వెళ్లలేక సింగరాయ నుంచి జగ్గయ్యపేట రోడ్డుకు వెళ్లి ఆకులు సీతంపేట మీదుగా ఆటో గ్రామానికి చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. గతంలో ఈ కోమటి చెరువు గట్టును వెడల్పు చేయుటకు విశాఖపట్నం అభ్యర్థి పురందేశ్వరి గారి ఎంపీ నిధుల నుండి 30 లక్షలు కేటాయించడం జరిగింది సామాజిక కార్యకర్త అప్పారావు అభ్యర్థుల మేరకు. అంతలో ప్రభుత్వం మారింది, తరువాత వచ్చిన స్థానిక ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గాని ఈ విషయం పట్టించుకోలేదు ఏమాత్రం వర్షం వచ్చినా ఈ రెండు గ్రామాలకు రాకపోకలకు అత్యవసర సమయాల్లో వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవసరమైన నిధులను మంజూరు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటారని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

➡️