తెర్లాం: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బేబినాయన నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువలా వచ్చాయి. వినతులను స్వీకరించిన బేబినాయన.. అర్జీలలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ హేమంత్‌కుమార్, ఎంపిడిఒ ఎస్.రామకృష్ణ, ఎస్‌ఐ సాగర్‌బాబు, ఎంఇఒ త్రినాథరావు, టిడిపి మండల అధ్యక్షులు నర్సుపల్లి వెంకట్‌నాయుడు, నర్సుపల్లివెంకటేశ్వరరావు పాల్గొన్నారు.సిఎం సహాయనిధి చెక్కు అందజేత నందబలగ గ్రామానికి చెందిన కొనపాల సంతోష్‌కుమార్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబినాయన వైద్య ఖర్చుల నిమిత్తం సిఎం సహాయనిధి నుంచి రూ.43,690 మంజూరు చేయించారు. ఆ చెక్కును తెర్లాంలో సంతోష్ కుమార్‌కు అందజేశారు.ప్రజల నుంచి వినతులు స్వీకరణ విజయనగరం టౌన్ : స్థానిక ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మిగజపతిరాజు గురువారం నగరంలోని కొత్తపేట బ్రహ్మం గారి మఠం రోడ్డు వద్ద గురువారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. 1వ డివిజన్ నుండి 15వ డివిజన్ పరిధిలో గల ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా వార్డులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వారి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు ప్రజలు పార్టీ కార్యాలయానికి వచ్చి అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వచ్చి వినతులు తీసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.