ప్రజాశక్తి – పాలకొండ : జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైసిపి పాలవలస రాజశేఖర్ మృతికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ను, రాజశేఖర్ సతీమణి రేగిడి జడ్పిటిసి ఇందుమతిని రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు. మంగళవారం రోజు రాజాం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు కొండ్ర మురళీమోహన్ గోండు శంకర్ పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాసు, మాజీఎమ్మెల్యే కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావు, దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ కార్యదర్శి శ్రీరామ సత్యనారాయణతో పాటు చుట్టుపక్కల నాయకులు రాజశేఖర్ మృతదేహాన్ని ఘనంగా నివాళులర్పించారు. బుధవారం రాజశేఖర్ స్వగ్రామైన అంపిలిలో నాగావళి నది సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీమంత్రి పీడిక రాజన్న దొర, విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నగర పంచాయతీచైర్మన్ పల్లా ప్రతాపు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్‌పి ముఖ్య నేతను కోల్పోయామన్నారు. రాజకీయంగా ఎనలేని సేవలు అందించారని,ఆయనలోని లోటు తీరని పేర్కొన్నారు.
