అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్య

Jan 16,2025 20:26

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని కొండవెలగా ఎస్‌సి కాలనీకి చెందిన టి. సూర్యనారాయణ (26) అప్పులు తీర్చలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు టి.కనకరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మృతుడు బట్టల షాప్‌లో పనిచేసుకొని జీవిస్తుండగా అవసరాల కోసం అప్పులుచేసి వాటిని తీర్చలేక మనస్థాపానికి గురై ఈ నెల 14న గ్రామ శివారులో మామిడి తోటలో ఎలుకల మందు, పురుగుల మందు కలుపుకొని తాగాడు. సంఘటనా స్థలం నుంచి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 15న రాత్రి మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ బి.గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️