ఎస్ఎఫ్ఐ డిమాండ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర మంత్రులు,జిల్లా అధికార యంత్రాంగం విద్యార్దులు నుంచి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడగొద్దని, ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని, విద్యార్దులను పరీక్షలు వరకు ఫీజులు విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని మంత్రులు, జిల్లా అధికారులు చెప్పిన ఎమ్మార్ కాలేజీ యాజమాన్యం ఫీజులు కోసం ఇబ్బందులు పెడుతుందని వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి సి హెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేసిన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్దులు ఎమ్మార్ కాలేజీ నుంచి కలెక్టరేట్ కు ర్యాలీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎమ్మార్ కాలేజీ యాజమాన్యం విద్యార్దులను ఫీజులు కట్టకపోతే బెదిరింపులకు పాల్పడుతుందనీ అన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినా వినకుండా విద్యార్దులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వెంటనే కలెక్టర్ కలుగుచేసుకొని యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రమేష్, రోజీ, సోమేష్ ఎమ్మార్ కాలేజీ విద్యార్దులు పాల్గొన్నారు.