ప్రజాశక్తి-బొబ్బిలి : శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని గొల్లవీధిలో చర్చి నిర్మాణ విషయంపై హిందూ, క్రైస్తవ మతాల పెద్దలకు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇరువురు సంయమనం పాటించాలని, వివాదాస్పద స్థలంలో పోలీస్ పికెట్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సతీష్‌కుమార్, తహశీల్దార్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.