మద్యం మత్తు మందులను నివారించాలి

Oct 2,2024 12:14 #Vizianagaram district

మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ
గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని,.మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మహిళలపై జరుగుతున్న దాడుల, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, మద్యం, మత్తు మందులను నివారించాలనీ కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మద్యం,మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటి వల్ల దేశంలో, రాష్ట్రంలో అనేక నేరాలకు యువత పాల్పడుతున్నారన్నారు. మత్తులో మహిళలు మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వమే మద్యం నియంత్రించే విధంగా, ప్రభుత్వమే మద్యం దుఖానాలు నిర్వహించాలన్నారు. గాంధీజీ మహిళా అర్ధరాత్రి ఒంటరిగా తిరిగ్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. నేడు ఆ పరిస్తితి దేశంలో రాష్ట్రంలో లేదన్నారు. తక్షణమే మద్యం,మత్తు పదార్థాలు నియంత్రించి, మహిళలు జరుగుతున్న దాడులను, సమర్థవంతంగా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు విపరీతంగా పెరగడం వలన పేదలు, సామాన్యులు సరైన తిండిలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు నియంత్రించాలని డిమాండ్ చేశారు. నిరసన ధర్నాలో ఐద్వా నాయకులు వి.లక్ష్మి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

➡️