గురజాడ స్ఫూర్తితో హింస వ్యతిరేక ఉద్యమం 

Nov 30,2024 11:47 #Vizianagaram district

ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ పిలుపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తున్నదన్న గురజాడ స్ఫూర్తితో హింసకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం అని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలూరి రమణమ్మ పిలుపునిచ్చారు. శనివారం గురజాడ అప్పారావు 109వ వర్ధంతిని విజయనగరం ఎల్.బి.జి నగర్లో నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి లు అర్పించారు. అంతరం ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గురజాడ అప్పారావు గొప్ప దేశభక్తుడు అని ఆయన రాసిన దేశభక్తి గేయం ఎల్లలు దాటి ప్రపంచ దేశాలన్నీ పాడుకో గలవని అన్నారు. కన్యాశుల్కం నాటకం ప్రదర్శన ద్వారా మహిళలు జీవితాలనే మార్చిన మహా కవి అని అన్నారు. కన్యాశుల్కం పోయినా వరకట్నం ఇంకా కొనసాగుతున్నదని మహిళలుపై హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకీ కొనసాగుతున్నాయని, అందుకు గంజాయి, మత్తు పదార్థాలు, విచ్చల విడిగా బార్ షాప్ లు నిర్వహణ వలన మరిత పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ హింస, వరకట్నం, మద్యం, తదితర మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పుణ్యవతి, రామలక్ష్మి, కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️