ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్టసేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ రాసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతులు పుస్తకాన్ని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు స్పీకర్‌గా సేవలందించిన నల్లపాటి వెంకట రామయ్య చౌదరి నుండి నుండి 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు వరకు 23 మంది శాసనసభాపతుల రాజకీయ జీవితవిశేషాలపై రాసిన పుస్తకం బాగుందని రచయితను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పంచాది అప్పారావు, వాసవీ వనితాక్లబ్ పూర్వ అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, రచయిత గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
