ప్రజాశక్తి-విజయనగరం : డిబిసిడబ్ల్యుఒగా ఎస్‌డి అనిత నియమితు లయ్యారు. గతంలో జిల్లాలో డిఆర్‌ఒగా ఆమె పనిచేశారు. ప్రభుత్వం ఆమెను బదిలీచేస్తూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడికి రిపోర్టు చేసింది. అప్పటి నుంచి ఆమె వెయిటింగ్‌లో ఉన్నారు. శుక్రవారం జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో ఆమెను జిల్లా బిసి సంక్షేమ, సాధికారత అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.