కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

May 24,2024 21:19

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, సకాలంలో పూర్తి చేసేలా అన్ని వసతులతో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లెండి కళాశాలలో చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. జెఎన్‌టియు-జివిలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు తెలిపారు. లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మెప్మా పీడీ సుధాకరరావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, జెఎన్‌టియు కేంద్రానికి డిప్యూటీ సిఇఒ రాజ్‌కుమార్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి ఇన్‌ఛార్జులుగా ఉంటారని వివరించారు. ఏర్పాట్లను వీరు పర్యవేక్షించాలని ఆదేశించారు. లెండి కళాశాలలో ఆర్‌అండ్‌బి, జెఎన్‌టియులో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖలు ఏర్పాట్లు చేస్తాయన్నారు. మూడు రోజులు ముందుగానే లెక్కింపు గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆ రోజు ఉదయం 6 గంటలకే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలవద్ద పటిష్టమైన బారికేడింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగితే, ఇబ్బంది పడకుండా లోపలా, వెలుపలా తగిన లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బందికి, ఏజెంట్లకు వేర్వేరుగా పార్కింగ్‌ ప్రదేశాలను నిర్ణయించాలని సూచించారు. ఏజెంట్లు నగదు చెల్లించి తీసుకొనే విధంగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పాత్రికేయుల కోసం రెండు చోట్లా రెండు మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీటిని డిపాజిట్‌ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైనప్పుడు తమవారికి సమాచారం అందించేందుకు పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని, అక్కడ మాత్రమే సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు, వేదికల ఇన్‌ఛార్జులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రజాశక్తి-విజయనగరంకోటఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, సకాలంలో పూర్తి చేసేలా అన్ని వసతులతో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లెండి కళాశాలలో చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. జెఎన్‌టియు-జివిలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు తెలిపారు. లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మెప్మా పీడీ సుధాకరరావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, జెఎన్‌టియు కేంద్రానికి డిప్యూటీ సిఇఒ రాజ్‌కుమార్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి ఇన్‌ఛార్జులుగా ఉంటారని వివరించారు. ఏర్పాట్లను వీరు పర్యవేక్షించాలని ఆదేశించారు. లెండి కళాశాలలో ఆర్‌అండ్‌బి, జెఎన్‌టియులో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖలు ఏర్పాట్లు చేస్తాయన్నారు. మూడు రోజులు ముందుగానే లెక్కింపు గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆ రోజు ఉదయం 6 గంటలకే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలవద్ద పటిష్టమైన బారికేడింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగితే, ఇబ్బంది పడకుండా లోపలా, వెలుపలా తగిన లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బందికి, ఏజెంట్లకు వేర్వేరుగా పార్కింగ్‌ ప్రదేశాలను నిర్ణయించాలని సూచించారు. ఏజెంట్లు నగదు చెల్లించి తీసుకొనే విధంగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పాత్రికేయుల కోసం రెండు చోట్లా రెండు మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీటిని డిపాజిట్‌ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైనప్పుడు తమవారికి సమాచారం అందించేందుకు పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని, అక్కడ మాత్రమే సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు, వేదికల ఇన్‌ఛార్జులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️