బొబ్బిలిలో బేబినాయన విస్తృత పర్యటన

Apr 13,2025 21:37

ప్రజాశక్తి – బొబ్బిలి : మండలంలో ఎమ్మెల్యే బేబినాయన ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. బొబ్బిలి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే భోజరాజపురం మున్సిపల్‌ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, గొల్లాది, పెంట, భీమవరం రైతులకు సాగునీరు అందించే పారాది ఆనకట్ట కాలువ, పారాది వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాలిపట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాలని ఎమ్మెల్యే బేబినాయన మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. భోజరాజపురం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ పరిశీలించి బోరుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్‌ డిఇ సురేష్‌, ఎఇ గుప్తాతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో మున్సి పల్‌ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేందుకు అవకాశాలు ఎంత వరకు ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించగా పట్టణ జనాభా పెరిగారని, పాత పంపు హౌస్‌, పైపులైన్‌ కావడంతో ప్రతిరోజు సరఫరా చేసేందుకు అవకాశం లేదని ఎఇ గుప్తా అన్నారు. సీతానగరం సువర్ణముఖి నది నుంచి మున్సిపాలిటీకు తాగునీరు అందించే ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యే వరకు ప్రజలు తాగునీరు కోసం ఇబ్బందులు పడకుండా కొత్త ఇన్‌ ఫిల్టర్‌ బావికి ప్రతిపాదనలు చేయాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా లీకులను నివారించి తాగునీరు అందించాలని ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాధాన్యతపారాది ఆనకట్ట కాలువ పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ జెఇ హరిని ఆదేశించారు. గొల్లాది, భీమవరం, పెంట రైతులకు సాగునీరు అందించే కాలువ వేగావతి నది కంటే ఎత్తుగా ఉండడంతో రైతులకు సంపూర్ణంగా సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే బేబినాయనకు జెఇ హరి వివరించారు. భోజరాజపురం వద్ద డైక్‌ నిర్మిస్తే రైతులకు సాగునీరు, మున్సిపల్‌ ప్రజలకు తాగునీరు అందించడం సులభంగా ఉంటుందని చెప్పగా భోజరాజపురం, పాల్తేరు వద్ద డైక్‌లు నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలన్నారు.పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితంపారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. పారాది వంతెన నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. తన సోదరుడు సుజయకృష్ణ రంగారావు మంత్రిగా ఉన్న సమయంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం పూర్తిగా పనులను ప్రారంభించలేదన్నారు. తమ తాత పారాది వంతెన నిర్మాణం చేశారని, వంతెన శిథిలావస్థకు చేరడంతో నూతన వంతెనకు తన సోదరుడు నిధులు మంజూరు చేశారన్నారు. వైసిపి నిర్లక్ష్యంతో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

➡️