ప్రజాశక్తి-గజపతినగరం : గజపతినగరంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ బజార్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు నిధులు రూ.15 లక్షలు, పంచాయతీ నుంచి రూ.5 లక్షలు సమకూర్చి, 32 షాపులతో ఈ బజారును నిర్మించినట్లు తెలిపారు. లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎండకు ఎండి, వర్షానికి తడిచి నీడ లేకుండా దుకాణదారులు అనేక ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం ఆ సమస్యను అధిగమించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఈ బజారును అభివృద్ధి చేసుకోవాలని ఉత్తరాంధ్రలో ఒక మోడల్‌గా దీనిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. బొండపల్లి మండల నాయకులు తమ మండలంలో కూడా ఇలాంటి బజార్ ఏర్పాటు చేయాలని కోరగా, తప్పకుండా ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గార తవుడు, ఎంపిపి బెల్లాన జ్ఞానదీపిక, మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, టిడిపి నాయకులు గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.