ప్రయాణికులకు మెరుగైన సేవలు: ఎమ్మెల్యే

Nov 29,2024 21:38

ప్రజాశక్తి- రాజాం : ఆర్‌టిసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్‌ అన్నారు. శుక్రవారం రాజాంలో రాజాం నుంచి బలిజిపేటకు వెళ్లే నూతన బస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందన్నారు. దీని కోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో కనీసం ఒక్క బస్సునూ కొనుగోలు చేయలేదని, మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసులు నడిపి ప్రయాణికులకు అవస్థలకు గురి చేశారన్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆర్‌టిసిను బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.ప్రభాకర్‌, సెక్యూరిటీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ప్రవీణ్‌ కుమార్‌, డిపో హెడ్‌ కానిస్టేబుల్‌ జి.రాంబాబు, టిడిపి నాయకులు గురువానా నారాయణరావు, టంకాల కన్నంనాయుడు, అడపా శ్రీను, శాసపు రమేష్‌, బవిరి శ్రీను, జరజాణ నితిన్‌, జనసేన నాయకులు యూపీ రాజు, గెడ్డపు నీలకంఠం, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మండలంలోని బొద్దాం గ్రామం నుంచి కొఠారిపురం గ్రామం రోడ్డుకు సుమారు రూ. 80 లక్షలతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధి పనులకు, మౌలిక వసతుల, నియోజకవర్గంలో రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉన్న 121 పంచాయతీలలో గల కాలువలు, సిమెంట్‌ రోడ్ల పనులు శర వేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.4కోట్లతో గుంతల రోడ్లు పూడ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. డంపింగ్‌ యార్డ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు మండలంలోని గార చీపురుపల్లి వద్ద ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను ఆయన పరిశీలించి కోకో నట్‌ మిషన్‌, ప్లాస్టిక్‌ బాయిలింగ్‌ మిషనను ప్రారంభించారు. మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ప్రారంభించిందన్నారు. ఈ మేరకు 4లక్షల విలువ చేసే కోకోనట్‌ మిషన్‌, 3.5 లక్షలు రూపా యలతో ప్లాస్టిక్‌ను నిలువరించే మిషన్‌, పాడైపోయిన కూరగా యలతో ఎరువులు తయారు చేసే మిషన్‌ను ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నామన్నారు.

➡️