సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
ప్రజాశక్తి-బొబ్బిలి : భగత్ స్పూర్తితో ప్రజా పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు. పట్టణంలోని లోకబందు రెసిడెన్సీలో ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శమన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. దేశానికి రాకముందు దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొడితే, నేడు పాలకులు కార్పోరేట్ సంస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన చేసి ప్రజా సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ పోరాటం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, వారి స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జి.శ్రీనివాస్, పి.శంకరరావు, టివి రమణ, తదితరులు పాల్గొన్నారు.