ప్రశాంతంగా బిఇడి ప్రవేశ పరీక్ష

Jun 8,2024 21:04

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : బిఇడి ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌-2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. 90 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస మోహన్‌ తెలిపారు. ఎంవిజిఆర్‌ కళాశాలలో 120 మందికి 103 మంది అభ్యర్థులు, సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో 150 మందికి 131 మంది, ఐయాన్‌ డిజిటల్‌ పరీక్షా కేంద్రంలో 500 మందికి 454 మంది అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు.

➡️